Uttam Kumar Reddy: మోటార్‌ ఆన్‌ చేసిన తెల్లారే.. ఆఫ్‌ చేశారు..

Uttam Kumar Reddy: మోటార్‌ ఆన్‌ చేసిన తెల్లారే.. ఆఫ్‌ చేశారు..
x
Highlights

Uttam Kumar Reddy: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరును రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

Uttam Kumar Reddy: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరును రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్ చేసిన విమర్శల్లోని ప్రధానాంశాలు ఇవే:

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏకంగా రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఉత్తమ్ మండిపడ్డారు. ఇది ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయంలో కేవలం 30 శాతం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

2015లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో ఇచ్చినప్పటికీ, డీపీఆర్ (DPR) సమర్పించడానికి 2022 వరకు, అంటే ఏడేళ్ల సమయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.

ప్రకటనలకే పరిమితం:

పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ ఆన్ చేసి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా ప్రకటించుకున్నారని ఉత్తమ్ గుర్తు చేశారు. అయితే, కేసీఆర్ మోటార్ ఆన్ చేసిన మరుసటి రోజే దానిని మళ్లీ ఆఫ్ చేశారని, అదంతా కేవలం ప్రచార ఆర్భాటమేనని ఆయన విమర్శించారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories