కోటి ఉద్యోగాలని బీజేపీ మోసం చేసింది: మంత్రి తలసాని

Arun Chilukuri
Published on: 4 March 2021 2:59 PM IST
Minister Talasani Srinivas Yadav Slams MLC Ramchander Rao
X

కోటి ఉద్యోగాలని బీజేపీ మోసం చేసింది: మంత్రి తలసాని

ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలకు బీజేపీ ఎసరు పెడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆరేళ్లు MLC గా ఉన్న BJP అభ్యర్థి రాంచందర్ రావు పట్టభద్రుల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలు కల్పించిందని మరో 50వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని అన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్, అమీర్‌పేట్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవితో కలిసి మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌ ను గెలిపించాలంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story