ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?

Arun Chilukuri
Updated on: 27 Feb 2021 10:00 PM IST
ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?
X

ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?

తెలంగాణలో కొత్త ఉద్యోగాలపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేటీఆర్‌ చెప్పిన అంకెలపై చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసరడంపై తలసాని ఘాటుగా స్పందించారు. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story