కేసీఆర్‌ జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్‌ను ఆవిష్కరించిన మంత్రి తలసాని

Arun Chilukuri
Published on: 15 Feb 2021 6:59 PM IST
కేసీఆర్‌ జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్‌ను ఆవిష్కరించిన మంత్రి తలసాని
X

సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం పుట్టినరోజు నాడు బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎమ్మెల్సీ కవితతో కలిసి సమర్పిస్తామని వెల్లడించారు. ఇక సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తా్మని తెలిపారు. అనంతరం కేసీఆర్‌ జీవిత చరిత్రను వివరించేలా రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్‌ను మంత్రి తలసాని ఆవిష్కరించారు. జలవిహార్‌లో నిర్వహించే సీఎం జన్మదిన వేడుకల్లో 30 నిమిషాల నిడివి గల త్రీడీ డాక్యుమెంటరీతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story