Talasani Srinivas Yadav: బీజేపీ నేతలు అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారు

Talasani Srinivas Yadav: ఎన్ని కుట్రలు చేసినా.. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం

Rama Rao
Published on: 19 Oct 2022 5:38 PM IST
Minister Talasani Srinivas Yadav Comments on BJP | TS News
X

Talasani Srinivas Yadav: బీజేపీ నేతలు అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారు

Talasani Srinivas Yadav: బీజేపీ నేతలు అమలుకు నోచని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడులో రెండోవిడత గొర్రెల పంపిణీపై బీజేపీ చేస్తున్న ప్రచారాలపై స్పందించిన ఆయన ఓ కాంట్రాక్టర్ స్వార్థం కోసం ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కుట్రలు చేసి బీజేపీ గెలవాలని చూస్తోందన్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యేనన్నారు. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రానికి 1000 కోట్లు తెస్తామంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. గెలిస్తే 3వేల పెన్షన్ ఎలా ఇస్తారని మంత్రి తలసాని నిలదీశారు. ఇక గొర్రెల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అన్న ఆయన గొర్రెల పంపిణీ డబ్బులను ఆపేలా చేసిన బీజేపీ ఇక ఆ డబ్బులు రావని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

Rama Rao

Rama Rao

Next Story