Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తప్పిన ప్రమాదం

Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 5:45 AM IST
Minister T Harish Raos Convoy Meets With An Accident
X

Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తప్పిన ప్రమాదం

Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హరీష్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డుగా అడవి పంది అడ్డురావడంతో డ్రైవర్‌ బ్రేక్‌ వేయగా.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. హరీష్‌రావు మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. హరీష్‌రావు వాహనం ముందు భాగం ధ్వంసమైంది. కొండపాక మండలం బందారం దర్గా కమాన్‌ సమీపంలో ప్రమాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story