logo
తెలంగాణ

Srinivas Goud: అవితప్పుడు ఆరోపణలు.. వారి పేర్లు త్వరలోనే బయటపెడతా..

Minister Srinivas Goud Response on his Election Affidavit
X

Srinivas Goud: అవితప్పుడు ఆరోపణలు.. వారి పేర్లు త్వరలోనే బయటపెడతా..

Highlights

Minister Srinivas Goud: కొందరు తనపై బాధ్యతారహిత్యంగా వార్తలు రాస్తున్నట్లు చెప్పారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.

Minister Srinivas Goud: కొందరు తనపై బాధ్యతారహిత్యంగా వార్తలు రాస్తున్నట్లు చెప్పారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఎవరిపై కోపంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారో చెప్పాలన్నారు ఆయన. ఎన్నికల టైమ్‌ నుంచే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్ర చేశారని చెప్పారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్‌ వేయించారని.. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్‌ గుర్తుతో పోటీ చేశారని మంత్రి ఆరోపించారు. బడుగు బలహీనవర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి పేర్లు త్వరలోనే బయటపెడతానని చెప్పారు.


Web TitleMinister Srinivas Goud Response on his Election Affidavit
Next Story