Srinivas Goud: నిజమైన బుల్లెట్ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా..

Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2022 5:40 PM IST
Minister Srinivas Goud Reacts on Gun Firing
X

Srinivas Goud: నిజమైన బుల్లెట్ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా..

Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మరోవైపు పోలీస్ అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే పోలీసుల ఎస్‌ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని తెలిపారు. తాను ఆల్‌ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్‌ను అని తాను క్రీడాశాఖ మంత్రిగా తనకు అర్హత కూడా ఉంటుందన్నారు. కానీ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సమాచారం అడిగి తెలుసుకోవాలన్నారు. ఎస్పీ ఇస్తేనే తాను కాల్చానని ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారని వివరించారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story