నిర్మల్ జిల్లా బాసరలో మంత్రి సీతక్క పర్యటన

Minister Seethakka: ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఇంటింటి ప్రచారంలో సీతక్క

Jyothi
Published on: 21 April 2024 2:23 PM IST
Minister Seethakka visit to Nirmal District Basara
X

నిర్మల్ జిల్లా బాసరలో మంత్రి సీతక్క పర్యటన 

Minister Seethakka: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం లో భాగంగా శారద నగర్ హనుమాన్ మందిర్ ని దర్శనం చేసుకొని స్థానిక మహిళలతో మాట్లాడారు అనంతరం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇంచార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. బాసర మండల కేంద్రంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని మొండి చేయి చూపించారని ఆరోపించారు. నిజామాబాద్ నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన ఒక ప్రతిపాదకగానే మిగిల్చారని అన్నారు వెనుకబడిన జిల్లా అయిన ఆదిలాబాద్ కు పది సంవత్సరాలు రాష్ట్రం లో ఉన్న బిఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ ప్రజలను పట్టించుకోలేదని తరువాత బిజెపి కి గాని టీఆర్ఎస్ కు గాని ఓటు అడిగే హక్కులేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story