మంత్రి సత్యవతి రాథోడ్‌కు మాతృ వియోగం.. సీఎం కేసీఆర్ సంతాపం..
Sathyavati Rathd: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
మంత్రి సత్యవతి రాథోడ్‌కు మాతృ వియోగం.. సీఎం కేసీఆర్ సంతాపం..
Sathyavati Rathd: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మా (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ.. ఈరోజు గుండె పోటుతో ఆమె మృతిచెందారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి శ్రీమతి గుగులోత్ దస్మా మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story




