గిరిజన ఆదివాసి సంఘాలతో మంత్రి సత్యవతి సమావేశం

*ఈనెల 17న జరగనున్న సీఎం కార్యక్రమంపై సమీక్ష

Rama Rao
Published on: 10 Sept 2022 4:19 PM IST
Minister Satyavathi Rathods Meeting with Tribal Adivasi Communities
X

గిరిజన ఆదివాసి సంఘాలతో మంత్రి సత్యవతి సమావేశం

Satyavathi Rathod: ఈనెల 17వ తేదీన ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసి బంజార సంఘాల నాయకులు, విద్యార్ధి, ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సభ ఏర్పాట్లపై చర్చించారు. 17వ తేదీన పీపుల్స్ ప్లాజా నుండి అంబేడ్కర్ విగ్రహం మీదుగా NTR స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story