శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సత్యవతి రాథోడ్
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మంత్రి సత్యవతి రాథోడ్ అర్చనలు, అభిషేకాలు చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story




