Satyavathi Rathod: ఎలాగో విజయం సాధించలేమని ముందే సభ పెట్టుకున్నారు

Satyavathi Rathod: తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు ఎం చేస్తారో చెప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని అనడం హస్యాస్పదంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 4 July 2022 4:30 PM IST
Minister Satyavathi Rathod Fires On BJP Leaders
X

Satyavathi Rathod: ఎలాగో విజయం సాధించలేమని ముందే సభ పెట్టుకున్నారు 

Satyavathi Rathod: తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు ఎం చేస్తారో చెప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని అనడం హస్యాస్పదంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ గెలవదని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాగో విజయం సాధించలేమని ఇప్పుడు విజయ సంకల్ప ముందే పెట్టుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పేనని ఆమె అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ నేతలను ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధితో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని దానిని ఎవ్వరు చెరపలేరని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story