Sabitha: ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా

Sabitha: గురువుల సేవలను కొనియాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి * డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులకు ఆదర్శం

Arun Chilukuri
Published on: 5 Sept 2021 11:33 AM IST
Minister Sabita Wished Teachers a Happy Teachers Day
X

సబితా ఇంద్రా రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా )

Sabitha Indra Reddy: టీచర్స్ డే సందర్భంగా తెలంగాణలోని ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులందరికీ మార్గదర్శమన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసేది గురువులేనని వారి సేవలను సబితా కొనియాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story