Sabitha Indra Reddy: పాఠశాలను సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.

Arun Chilukuri
Published on: 1 Sept 2021 4:38 PM IST
Minister Sabitha Indra Reddy Inspects Vijay Nagar Colony Govt School
X

Sabitha Indra Reddy: పాఠశాలను సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయనగర్‌ కాలనీలోని ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అని తనిఖీ చేశారు. మెరుగైన ఫలితాల కోసమే ఆఫ్‌లైన్‌పై దృష్టి పెట్టామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

విద్యార్థులతో మమేకమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. మరికొద్దిమందితో ముచ్చటించిన మంత్రి చిన్నపిల్లల చేతులు పట్టుకొని పలకపై అక్షరాలు రాయించారు. విద్యార్థుల్లో కోవిడ్‌ భయం పొగొట్టేవిధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story