ఖమ్మంలో డ్రైవింగ్ సిమ్యులేటర్... ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మంలో డ్రైవింగ్ సిమ్యులేటర్... ప్రారంభించిన మంత్రి పువ్వాడ
x
డ్రైవింగ్ సిమ్యులేటర్ ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ
Highlights

Minister Puwada Ajay Kumar Launched Driving simulator : తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఖమ్మం రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేశారు.

Minister Puwada Ajay Kumar Launched Driving simulator : తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఖమ్మం రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేశారు. కాగా సోమవారం ఆయా సిమ్యులేటర్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం హరిత హారం కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల్లో అనేక మార్పులు, చేర్పులు చేపట్టామన్నారు. ఈ మార్పుల అనంతరం కొన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. జులై 24వ తేదీన మరో 5 సేవలు ఆన్ లైన్ పొందుపరిచామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇది వినియోగదారుడికి ఎంతో సౌకర్యవంతంగా మారిందని తెలిపారు. వినియోగదారుడు కార్యాలయానికి రాకుండానే అనేక సేవలను ఆన్ లైన్ లో చేసుకునే విధంగా చేశామన్నారు.

ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిమ్యులేటర్‌ విధంగానే తొలిసారిగా ఖమ్మంలో ఈ సౌకర్యం కల్పించామని, లెర్నింగ్‌ లైసెన్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్‌ శిక్షణకు ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ రవాణా కార్యాలయంలో ఉండే ప్రతి సౌకర్యాన్ని అన్ని జిల్లాల్లో విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఖమ్మంలో సిమ్యులేటర్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి డ్రైవింగ్‌ స్కూల్లో సిమ్యులేటర్‌ శిక్షణ తప్పనిసరి చేయనుమని పేర్కొన్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్‌ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందన్నారు. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్‌ ద్వారా డ్రైవింగ్‌ మెళకువలను తెలుసుకోడం తప్పనిసరి అని, ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్‌ శిక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్లు, భారీ వాహనాలు నేర్చుకోదలచిన వారు మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందేనని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories