Ponnam Prabhakar: అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళి

Ponnam Prabhakar: హుస్నాబాద్ చౌరస్తాలో ఘనంగా అంబేద్కర్ జయంతి

Jyothi
Published on: 14 April 2024 11:46 AM IST
Minister Ponnam Prabhakar pays tribute to Ambedkar statue
X

Ponnam Prabhakar: అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళి

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లాలో బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ చౌరస్తాలోమంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్ కి దిక్సూచిగా మారిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం భారతదేశంలోనే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రజాస్వామ్యంలో నియంతృత్వనికి పెద్ద పీట వేస్తూ అప్రజా స్వామికంగా వ్యవహరిస్తున్న సందర్భంలో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే ఒక హక్కు ఉండే విధంగా ఆనాడు రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story