తెలంగాణ నిధులు కేంద్రం దయ కాదు.. మన హక్కు: మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పొన్నం బహిరంగ లేఖ!
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ నిధులు కేంద్రం దయ కాదు.. మన హక్కు: మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పొన్నం బహిరంగ లేఖ!
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన ఘాటుగా బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు:
పార్లమెంట్‌లో జరుగుతున్న బడ్జెట్ చర్చల్లో తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్ర మంత్రులు గళం విప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. "ఎన్నికలు, రాజకీయాలు వేరు.. రాష్ట్ర అభివృద్ధి వేరు. తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు, ఆ నిధులు తిరిగి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయడం కేంద్రం బాధ్యత. ఇది కేంద్రం పెడుతున్న భిక్ష కాదు, తెలంగాణ ప్రజల హక్కు" అని ఆయన స్పష్టం చేశారు.
12 ఏళ్లయినా నెరవేరని విభజన హామీలు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మంత్రి విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడి నిధులు సాధించాలని ఆయన సూచించారు.
మంత్రి పొన్నం ప్రధాన డిమాండ్లు:
బడ్జెట్ చర్చల్లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలి.
విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను తక్షణమే పరిష్కరించాలి.
రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయ వివక్షను పక్కన పెట్టి కేంద్రం నుండి రావాల్సిన వాటాను తీసుకురావాలి.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించడం కేంద్రానికి తగదని, ఇకనైనా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.




