Ponguleti Srinivas Reddy: పెదవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంలో అధికారులు ఆలస్యం చేశారన్న మంత్రి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 July 2024 11:00 PM IST
Minister Ponguleti inspected the Peddavagu project
X

Ponguleti Srinivas Reddy: పెదవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాలకు కట్టలు తెగిపోయి దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్ట్ ను రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్ట్ తీవ్రంగా నష్టపోవడానికి ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోందన్నారు. 70 వేల క్యూసెక్కుల వరద ఎగువ నుండి వస్తుంటే... ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంలో ఆలస్యం జరిగిందని.. అందుకే ఇంతటి నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే మూడో గేటు తెరిచి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు.

పూర్తిగా దెబ్బ తిన్న పెదవాగు ప్రాజెక్ట్, విద్యుత్ లైన్లు, రోడ్ల మరమ్మతులకు ఎనిమిదన్నర కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వరద నీటితో నష్టపోయిన 4 వందల ఎకరాల పొలాల రైతులకు 10 వేల నష్టపరిహారంతో పాటు వరి, పత్తి సహా అన్ని పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story