Ponguleti: సీఎం పదవిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti: కాంగ్రెస్‌లో నేను జూనియర్..నేనెలా సీఎం అవుతాను

Shashank Gullapelli
Published on: 21 March 2024 3:46 PM IST
Minister Ponguleti Comments On The Post Of CM
X

Ponguleti: సీఎం పదవిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti: సీఎం పదవి ప్రచారంపై మంత్రి పొంగులేటి స్పందించారు. తాను సీఎం అవుతానంటూ కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తాను జూనియర్ అని..అలాంటప్పుడు సీఎం ఎలా అవుతానని ప్రశ్నించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు పొంగులేటి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 11 పైగా, బీజేపీకి 2, బీఆర్ఎస్‌కు ఒకటి లేదా రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. చేరికలపైనా స్పందిచిన పొంగులేటి...తాము ఇంకా గేట్లు ఎత్తలేదని.. ఒక వేళ ఎత్తితే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లతో డ్యామేజ్‌ ఆగదని..మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందన్నారు పొంగులేటి..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story