Minister Niranjan Reddy: తెలంగాణకి కేంద్రం ఏమైనా బిక్షం వేస్తుందా?

* రైతుల కల్లాల సొమ్మును వెనక్కి ఇవ్వాలని.. కేంద్రం లేఖ రాయడంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

R Tripura Malini
Published on: 22 Dec 2022 7:01 PM IST
Minister Niranjan Reddy Questions The Central Govt
X

తెలంగాణకి కేంద్రం ఏమైనా బిక్షం వేస్తుందా?

Minister Niranjan Reddy: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమైనా బిక్షం వేస్తుందా అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన రైతుల కల్లాల సొమ్మును.. వెనక్కి ఇవ్వాలని కేంద్రం లేఖ రాయడంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి తెలంగాణ రైతుల కష్టంతో వచ్చిన నిధులని ఆయన గుర్తుచేశారు. కేంద్రం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి నేతలు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story