Top
logo

భూ వివాదంపై మంత్రి మల్లారెడ్డి వివరణ

భూ వివాదంపై మంత్రి మల్లారెడ్డి వివరణ
X
Highlights

భూమి కబ్జా పై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు శ్యామల దేవి ఎవరో తనకు తెలియదన్నారు. సర్వే నెంబర్...

భూమి కబ్జా పై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు శ్యామల దేవి ఎవరో తనకు తెలియదన్నారు. సర్వే నెంబర్ ప్రకారం ఆమె భూమి అక్కడే ఉందన్నారు. తాము ఎక్కడకి వెళ్లలేదని.. ఎవరూ కబ్జా చేయలేదని చెప్పారు. శ్యామలాదేవికి మంత్రిగా న్యాయం చేస్తానని.. అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు మల్లారెడ్డి.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో తన భూమి కబ్జా చేశారని శ్యామలాదేవి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరులు తనకున్న రెండు ఎకరాల 13 గుంటల భూమిలో 20 గుంటలు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపించారు. మంత్రి ఆధీనంలో ఉన్న భూమిని విడిపించాలంటూ న్యాయవాదిని సంప్రదిస్తే ఆయనతో మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని ఫిర్యాదులో తెలిపింది. శ్యామల ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకుతోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి మల్లారెడ్డి అక్రమంగా తమ భూమిని కబ్జా చేయడమే కాకుండా తన మనుషులతో దౌర్జన్యం చేయిస్తున్నాడని బాధితురాలు శ్యామలాదేవి ఆరోపిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి అనుచరులు తన ఇంటిపై దౌర్జన్యం చేశారని శ్యామల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, అందుకే HRCని ఆశ్రయించినట్లు శ్యామలాదేవి తెలిపింది.


Web TitleMinister Mallareddy's explanation on the land dispute
Next Story