Telangana: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డా మంత్రి మల్లారెడ్డి సోదరుడు

Telangana: కొన్నాళ్లుగా నర్సింహారెడ్డి పేకాటస్థావరాన్ని నిర్వహిస్తున్నారు.

Sandeep Eggoju
Updated on: 17 Jun 2021 5:30 PM IST
Minister Mallareddy Brother Narshimha Reddy Arrested for Playing Poker
X

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డా నరసింహ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Telangana: మంత్రి మల్లారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కొన్నాళ్లుగా నర్సింహారెడ్డి పేకాటస్థావరాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ రాష్ట్రంలో పేకాటను నిషేధించి.. క్లబ్‌లను మూయించింది. నర్సింహారెడ్డి బోయిన్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు సమచారం. మంత్రి సోదరుడు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అన్న పదవిని అడ్డుపెట్టుకొని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నర్సింహారెడ్డి పాల్పడుతున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో.. నర్సింహారెడ్డి గేమింగ్‌ హౌజ్ వ్యవహారం వెలుగుచూసింది. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కాకముందే.. నిందితులకు బెయిల్‌ రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story