Malla Reddy: యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం

Malla Reddy: ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం విరాళం

Sandeep Eggoju
Published on: 9 Nov 2021 3:02 PM IST
Minister Malla Reddy Huge Donation to Yadadri Temple
X

యాదాద్రి దేవాలయానికి 3 కోట్ల 10 లక్షలు విరాళము ఇచ్చిన మాల్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Malla Reddy: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి విరాళాలు కొనసాగుతున్నాయి. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 3కోట్ల 10లక్షల రూపాయలను దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. అక్టోబర్ 28న మూడున్నర కిలోల బంగారానికి గాను 1.83 కోట్లు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం తొమ్మదిన్నర కిలోల బంగారానికి గానూ 4.93 కోట్లు విరాళంగా ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కలిసి ఇచ్చిన అమౌంట్‌ను ఆలయానికి అందజేశారు.‌ స్వామివారి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడానికి విరాళం ఇచ్చే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story