Malla Reddy: అప్పటినుంచి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తునే ఉన్నారు

Malla Reddy: తన సవాల్‌ను రేవంత్‌ రెడ్డి స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 28 Aug 2021 3:36 PM IST
Minister Malla Reddy Counter to Revanth Reddy
X

Malla Reddy: అప్పటినుంచి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తునే ఉన్నారు

Malla Reddy: తన సవాల్‌ను రేవంత్‌ రెడ్డి స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఏవో జిరాక్స్ పేపర్లు తీసుకువచ్చిన తాను కబ్జా చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలతో తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూశారని మల్లారెడ్డి అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. టీడీపీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆక్షేపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story