KTR: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

Dhatripriya
Published on: 2 April 2023 12:11 PM IST
Minister KTRs Open Letter To Central Govt
X

KTR: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని లేఖ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని సూచించారు. వర్కింగ్‌ క్యాపిటల్‌, నిధుల సమీకరణ పేరుతో.. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కార్పొరేట్‌ మిత్రులకు 12.5 లక్షల కోట్లను ప్రధాని మాఫీ చేశారని.. కేంద్రమే ఆర్థికసాయం అందించి స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఉత్పత్తులు కొనాలన్నారు. ఇక కేంద్రం తక్షణమే స్టీల్‌ప్లాంట్‌కు 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లక్షన్నర కోట్లు విలువచేసే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరంచేసే కుట్రలు ఆపాలంటూ లేఖలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌.

Dhatripriya

Dhatripriya

Next Story