Tank Bund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. కేటీఆర్‌ ట్వీట్ వైర‌ల్..

Tank Bund Shiva New Home Tour: ట్యాంక్ బండ్ శివ ఈయన గురించి హైదరాబాద్‌లో చాలా మందికి తెలుసు.

Arun Chilukuri
Published on: 16 Sept 2022 3:05 PM IST
Minister KTR Will Visit Tank Bund Shiva Home Soon
X

Tank Bund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. కేటీఆర్‌ ట్వీట్ వైర‌ల్..

Tank Bund Shiva New Home Tour: ట్యాంక్ బండ్ శివ ఈయన గురించి హైదరాబాద్‌లో చాలా మందికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే ఉంటున్నారు. వివిధ కారణాలతో హుస్సేన్ సాగర్‌లో పడి ఆత్మహత్యాయత్నం చేసే వారిలో.. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అప్పటికే చనిపోయిన వారి శవాలను తన చేతులతో బయటకు తీశారు. ట్యాంక్ బండ్ శివగా పేరొందిన తను ఎండ, వాన అని పట్టించుకోకుండా ట్యాంక్ బండ్ మీదనే జీవించేవాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాపిల్లలతో కూడా అదే ట్యాంక్ బండ్ మీద చిన్న గుడిసె వేసుకొని జీవించేవాడు.

శివ పేదరికంపై పలు పత్రికలు, ఛానెళ్లు ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ ఇంటర్వ్యూలలో శివ తన కష్టాలు, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలుపడంతో చలించిపోయిన తెలంగాణ మంత్రి కేటీఆర్ శివకు నెక్లెస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించారు. తాజాగా శివ కుటుంబం కొత్త ఇంటికి వెళ్లింది. ఇప్పుడు ప్రస్తుతం శివ తన ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్యాంక్‌బండ్ శివ ఏం చేస్తున్నారు అతని పరిస్థితి ఎలా ఉందని ఓ యూట్యూబ్ ఛానెల్ శివను ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో శివ ఓ కోరిక కోరాడు. ట్యాంక్‌బండ్‌పై గుడిసెలో ఉండే తనకు మంత్రి కేటీఆర్ ఇల్లు ఇచ్చారని దాన్ని తాను ఎంతో అందంగా తయారు చేసుకున్నానని చెప్పాడు. అంతేకాదు తనకు కేటీఆర్ ఎంతో సాయం చేశారని ఒక్కసారి ఆయన తన ఇంటి గడపతొక్కాలని కోరారు. ట్యాంక్‌ బండ్‌ శివ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని కేటీఆరే స్వయంగా గురువారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. త్వరలోనే ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళ్తానని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story