KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటన

KTR: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి

Rama Rao
Updated on: 20 April 2022 1:31 PM IST
Minister KTR Will Tour Warangal District Today
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటన

KTR: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కాళాశాలకు చేరుకుంటారు. ఎంజీఎంలో జరిగే కార్యక్రమంలో మంత్రి కేటీఆర హాజరు కానున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, సీఎంఏ, మున్సిపల్ సధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ పథకాల కింద 27.63 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.

వర్ధన్నపేట, వరంగల్, పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల,. నర్సంపేట నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారు చుడతారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పరిశీలించారు. మద్యాహ్నం మూడు గంటలకు హన్మకొండ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత హయగ్రీవాచారి గ్రౌండ్ లో నిర్వహించనున్న సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కేటీఆర్‌ పర్యటన సందర్భంగా వరంగల్‌ నగరాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు గులాబీ మయంగా మార్చారు.


Rama Rao

Rama Rao

Next Story