KTR: ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచిన కేటీఆర్

KTR: ఒకే రోజు రోడ్ షోలు, ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్న కేటీఆర్

Jyothi
Published on: 15 Nov 2023 11:51 AM IST
Minister KTR Visit to Sircilla District
X

KTR: ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచిన కేటీఆర్ 

KTR: ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి కేసీఆర్ డోస్ పెంచారు. బాస్ మాత్రమే కాకుండా.. బీఆర్ఎస్ అగ్ర నాయకులు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రుద్రంగి మండలం కేంద్రంలో రోడ్ షో నిర్వహించనున్నారు. 1.30 గంటలకు చందుర్తి మండలం కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోనరావుపేట మండలంలో, 3 గంటలకు వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొననున్నారు.

మరోవైపు 11 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ ‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీష్ రావు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు సెగ్మెంట్లలో నిర్వహించే ఇంటింటి ప్రచారంలో పాల్గొననున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాల్లారెడ్డిలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూనే.. జిల్లాలోనూ నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story