KTR: నేడు నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: సిద్ధాపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న మంత్రి కేటీఆర్

Rama Rao
Published on: 16 Feb 2022 6:55 AM IST
Minister KTR Visit to Nizamabad District Today | Telugu New Today
X

నేడు నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిదన్నర గంటలకు హైదరాబాద్‌ నుంచి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి హెలికాప్టర్‌ ద్వారా వర్ని మండలం సిద్ధాపూర్‌కు ఆయన చేరుకోనున్నారు. పదిన్నర గంటలకు సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనులను మంత్రి ప్రారంభింస్తారు. అనంతరం.. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్. 11 గంటలకు సిద్ధాపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు మంత్రి కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story