KTR: ఇవాళ నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: రూ.1,150కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Jyothi
Published on: 4 Oct 2023 8:35 AM IST
Minister KTR Visit to Nirmal District Today
X

KTR: ఇవాళ నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన 

KTR: ఇవాళ నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. దాదాపు 1,150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్ చేరుకుని కాల్వ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story