KTR: నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కేటీఆర్ టూర్

Jyothi
Published on: 15 March 2023 7:28 AM IST
Minister KTR Visit to Kamareddy District Today
X

KTR: నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా నిజాంసాగర్ వద్ద 25 కోట్లతో నిర్మించిన వెంతెనను, కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 40వేల ఎకరాలకు సాగు నీరందించే నాగ మడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Jyothi

Jyothi

Next Story