వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్​ సెటైర్​!

KTR on Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2021 1:53 PM IST
Minister KTR Tweet on Somu Veerraju Words on Liquor Rates
X

వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్​ సెటైర్​!

KTR on Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఏపీలో 50 రూపాయిలకే చీప్‌ లిక్కర్‌ ఇస్తామనడం.. బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ట్వీట్‌ చేశారు. వావ్‌ వాటే స్కీమ్‌ అంటూ సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్.. 50కే చీప్ లిక్కర్‌ ఇవ్వాలనేది జాతీయ విధానమా..? లేక బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకే ఆఫర్‌ వర్తిస్తుందా..? అని ప్రశ్నించారు.

విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్​ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్​ కాగా.. మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story