Minister KTR: మోడీ పాలనలో ధరలు ఆకాశంలో..ఆదాయాలు పాతాళంలో..

Minister KTR: ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం.. ఆడబిడ్డలపై ఆర్థిక భారమా..?

Rama Rao
Updated on: 14 Oct 2022 1:20 PM IST
Minister KTR Tweet on Central Government | Telangana News
X

Minister KTR: మోడీ పాలనలో ధరలు ఆకాశంలో..ఆదాయాలు పాతాళంలో..

Minister KTR: పేద, మధ్యతరగతి వంటిట్ల నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపుపై మోడీని కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మోడీ పాలనలో నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, ఆదాయం మాత్రం పాతాళంలోకి పోతోందని ఫైర్ అయ్యారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేస్తూ ఆడబిడ్డలపై మోడీ ఆర్ధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. మోడీకి ఆయిల్ కంపెనీల నష్టాలు మాత్రమే కనిపిస్తాయని, పేదల కష్టాలు ఏమాత్రం కనిపించవని ఎద్దేవా చేశారు.

Rama Rao

Rama Rao

Next Story