KTR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన..

KTR: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Shekhar G
Published on: 30 Sept 2023 9:47 AM IST
Minister Ktr Tour Of Four Constituencies In Khammam District
X

KTR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన..

KTR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చేరుకుంటారు. తొలుత గుబ్బగుర్తి ఆయిల్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారన్నారు. తర్వాత ఖమ్మం నగరానికి విచ్చేసి ఎస్బీఐటీ కళాశాల సమీపంలో మున్సిపల్‌ స్పోర్ట్స్‌ పార్క్‌, గోళ్లపాడు చానెల్‌పై నిర్మించిన పార్క్‌లు, వీడివోస్‌ కాలనీలో వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్లను ప్రారంభించనున్నారు. కాల్వొడ్డులోని మున్నేరు వద్ద తీగల వంతెన, నగరంలో పలుచోట్ల డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం నగరంలో నిర్వహించనున్న ప్రగతి నివేదిన సభలో పాల్గొంటారు. సభ తర్వాత భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణానికి మంత్రి కేటీఆర్‌ చేరుకుని సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ప్రారంభిస్తారు. అనంతరం సత్తుపల్లికి చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story