KTR Tour: సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన

* పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి కేటీఆర్ * పలువురిని పరామర్శించిన కేటీఆర్

Shilpa
Updated on: 9 Oct 2021 9:00 PM IST
Minister KTR Tour in Sircilla Constituency
X

సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన(ఫోటో- ది హన్స్ ఇండియా)

KTR Tour in Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామంలో సర్పంచ్ గోపాల్ రావు మనవని నామకరణ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం ఆవునూరు గ్రామంలో ముస్తాబాద్ జెడ్పీటీసీ దేవయ్య తల్లి ఇటీవల మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అక్కడి నుండి బయల్దేరిన కేటీఆర్ అదే మండలములోని కొండాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ తన పీఏ మహేందర్ రెడ్డి సోదరుడు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గంబీరావుపేట మండల కేంద్రానికి చేరుకొని అక్కడ సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Shilpa

Shilpa

Next Story