KTR: ఇవాళ కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్

KTR: కామారెడ్డిలో ఎన్నికలు, మెజార్టీపై.. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నకేటీఆర్

Jyothi
Published on: 31 Oct 2023 10:25 AM IST
Minister KTR Tour in Kamareddy Today
X

KTR: ఇవాళ కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్

KTR: కామారెడ్డి నియోజకవర్గంలో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుందటంతో ఇంఛార్జీగా మంత్రి కేటీఆర్‌కు బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలో మండలాల వారిగా బూత్ కమిటీలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు. ఉదయం 11గంటలకు మాచారెడ్డి చౌరస్తాలో మాచ్చారెడ్డి, రామారెడ్డి మండలాల బూత్ కమిటీలతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కామారెడ్డి అంగడి బజారు టౌన్‌లో కామారెడ్డి బూత్ కమిటీ సమావేశం జరగనుంది.

బుధవారం ఉదయం బిక్కనూరులో, రాజాంపేట్‌లో మధ్యాహ్నం దోమకొండలో, అనంతరం బీబీపేట్‌లో బూత్ కమిటీ మీటింగ్ జరపబోతున్నారు. కామారెడ్డిలో ఎన్నికలు, భారీ మెజారిటీ కోసం పార్టీ శ్రేణులను మంత్రి కేటీఆర్ సన్నద్ధం చేయనున్నారు. ప్రతి ఓటర్‌ను కలిసేలా బూత్ కమిటీలను పటిష్టం చేసేలా ప్లాన్‌తో ముందుకు సాగనున్నట్లు సమాచారం. కామారెడ్డిలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్..పార్టీ నేతలకు సమన్వయంతో పాటు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. పార్టీలో నెలకొన్న విభేదాలు పరిష్కరిస్తూ.. గెలుపు వ్యూహం పై కసరత్తు చేయడానికి ప్రయత్నిస్తూ.. 100 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జీ నియామకం చేశారు.

Jyothi

Jyothi

Next Story