KTR: జీవో 58,59 కింద హైదరాబాద్‌లో లక్ష కుటుంబాలకు పట్టాలు

Minister KTR Speech in LB Nagar
x

KTR: జీవో 58,59 కింద హైదరాబాద్‌లో లక్ష కుటుంబాలకు పట్టాలు 

Highlights

KTR: ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌ లోపు పంపిణీ చేస్తాం

KTR: నగరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు లక్ష పూర్తయినయి. ఈ ఇండ్లను ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఇండ్లు పూర్తయినయని.. అలాట్‌మెంట్‌ చేసుకుని.. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.

గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు ఇవ్వబోతున్నాని చెప్పారు. ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే డబుల్‌ బెడ్రూం ఇండ్లు 4 వేలు, గృహలక్ష్మీ పథకం కింద 3వేలు వస్తాయని అన్నారు. జీవో నెం.58, 59 కింద 11వేలు వచ్చాయని, జీవో నెం.118 కింద 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 40 వేల పైచిలుకు కుటుంబాలకు సొంతింటి కల నెరవేరిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories