Assembly: ఎక్కడా అభివృద్ధి పనులు ఆగలేదు: కేటీఆర్

Assembly: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ బడ్జెట్‌ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri
Published on: 24 March 2021 6:10 PM IST
Minister KTR Speech In Assembly
X

Assembly: ఎక్కడా అభివృద్ధి పనులు ఆగలేదు: కేటీఆర్

Assembly: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ బడ్జెట్‌ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. పట్టణాల్లో గ్రీన్ బడ్జెట్‌కు 286కోట్లు కేటాయించామన్నారు. గ్రీన్ బెల్టు కోసం 1918 నర్సరీలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నా ఏ అభివృద్ధి పనులు కూడా ఆపకుండా పౌరుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాబోయే ఆర్నెలల్లో ప్రతి మున్సిపాలిటీల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు స్థాపిస్తామన్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story