KTR: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు డయానా అవార్డు

KTR: షోమా ప్రాజెక్ట్‌తో పలు కార్యక్రమాలు చేపట్టిన హిమాన్షు * హిమాన్షు చేసిన ప్రయత్నానికి డయానా అవార్డు

Sandeep Eggoju
Updated on: 29 Jun 2021 1:11 PM IST
Minister KTR son Himanshu Got Dina Award
X
కేటీఆర్ కుమారుడు హిమాన్షు (ట్విట్టర్ ఫోటో)

KTR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు.. మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు.. ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. గ్రామాల స్వయం సమృద్ధి కోసం హిమాన్షు ఇటీవల 'షోమా' పేరుతో ఓ వీడియో రూపొందించారు. కల్తీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంపై, గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్ మరియు యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో ఈ మేరకు ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చిన డయానా అవార్డు ఆర్గనైజేషన్‌ అతడికి అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని హిమాన్షు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు సహకరించిన గ్రామస్తులకు, తన మెంటార్లకు కృతజ్ఞతలు తెలిపారు హిమాన్షు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story