పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?: కేటీఆర్

Minister KTR: ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు.

Arun Chilukuri
Updated on: 13 Aug 2022 9:45 PM IST
Minister KTR Slams pm Modi Over Freebies Criticism
X

పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?: కేటీఆర్

Minister KTR: ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. పేదల పథకాలపై మోడీకి ఎందుకంత అక్కసు అంటూ దుయ్యబట్టారు. పేదవాడి పొట్ట కొట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే ఉచిత పథకాలపై చర్చకు తెర తీశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అంటూ మోడీని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పత్రికా ప్రకటన విడుల చేశారు. మోడీ ప్రభుత్వం 80 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, ఆ అప్పుతో ఎవరిని ఉద్ధరించారని నిలదీశారు. దేశ సంపదను పెంచే తెలివి మోడీకి లేదన్నారు. సంపదను పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే తెలివి అంతకన్నా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story