KTR: టీఆర్ఎస్‌ లేకపోతే టీ.బీజేపీ, టీ.కాంగ్రెస్‌ వచ్చేవా..?

KTR: కేసీఆర్‌ను తిడితే పెద్ద నాయకులమైపోతామనే ఆలోచన విధానాన్ని మానుకోవాలన్నారు మంత్రి కేటీఆర్‌.

Arun Chilukuri
Published on: 8 July 2021 5:15 PM IST
Minister KTR Slams Opposition Leaders
X

KTR: టీఆర్ఎస్‌ లేకపోతే టీ.బీజేపీ, టీ.కాంగ్రెస్‌ వచ్చేవా..?

KTR: కేసీఆర్‌ను తిడితే పెద్ద నాయకులమైపోతామనే ఆలోచన విధానాన్ని మానుకోవాలన్నారు మంత్రి కేటీఆర్‌. టీఆర్ఎస్‌ లేకపోతే టీ.బీజేపీ, టీ.కాంగ్రెస్‌ వచ్చేవా అని ప్రశ్నించారు ఆ‍యన. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఢీకొట్టే వాళ్లెవరూ లేరని తెలిపారు.

కేసీఆర్‌ను తిడితే ఓట్లు వస్తాయనుకోవడం వెర్రితనం అవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాదిరిగా ప్రజలను ప్రేమించడం నేర్చుకుంటే కాస్తో.. కూస్తో ఓట్లు పడతాయని హితవుపలికారు. త్వరలోనే దేశానికే పాఠాలు చెప్పే దిశగా తెలంగాణ తయారవుతుందని మంత్రి వివరించారు. మొన్నటి దాకా సోనియాను తెలంగాణ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story