Minister KTR: గ్యాస్‌ సిలిండర్‌ పై బాదుడు.. కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

Minister KTR: గ్యాస్‌ సిలిండర్‌ పై బాదుడు.. కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

Rama Rao
Published on: 6 July 2022 1:12 PM IST
Minister KTR Setairical Tweet on LPG Price
X

Minister KTR: గ్యాస్‌ సిలిండర్‌ పై బాదుడు.. కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

Minister KTR: కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచూ తనదైన శైలిలో ఎండగట్టే మంత్రి కేటీఆర్‌ తాజాగా మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.50మేర పెంచిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందించారు.

''మంచి రోజులు వచ్చేశాయ్‌ (అచ్చేదిన్‌ ఆగయా) అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు'' అని కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. తాజాగా పెంపుతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,055 నుంచి రూ.1,105కు చేరిన విషయం తెలిసిందే.

Rama Rao

Rama Rao

Next Story