KTR: బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్

KTR: ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సెటైర్లు

Jyothi
Published on: 21 Oct 2022 12:06 PM IST
Minister KTR Satires Prime Minister Modi on Twitter
X

KTR: బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్

KTR: బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారని, బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కానీ భారత ప్రధాని దేశాన్ని దివాళా తీస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశం చాలా హీనస్థితికి చేరిందన్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉందన్నారు. గడిచిన 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం కూడా ఏర్పడిందన్నారు. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా మన దగ్గర ఉన్నట్లు మంత్రి తెలిపారు. అమెరికాతో డాలర్‌తో పోలిస్తే ఇండియాలో ప్రస్తుతం రూపాయి విలువ అత్యంత దారుణంగా పతనమైందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story