Minister KTR: మోడీ మ‌హాన‌టుడు.. ఆస్కార్ వ‌స్తుంది..

Minister KTR: మోడీకి, ఈడీకి భయపడేది లేదన్నారు మంత్రి కేటీఆర్‌.

Arun Chilukuri
Updated on: 15 March 2023 7:15 PM IST
Minister KTR Satires On PM Narendra Modi
X

Minister KTR: మోడీ మ‌హాన‌టుడు.. ఆస్కార్ వ‌స్తుంది..

Minister KTR: మోడీకి, ఈడీకి భయపడేది లేదన్నారు మంత్రి కేటీఆర్‌. ఎవరు నీతి మంతులో.. ఎవరు అవినీతి మంతులో.. 2023లో ప్రజలే తీర్పు ఇస్తారన్నారన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ నాయకులు ఒక్క ఛాన్స్‌ అంటున్నారని.. ఒక్క ఛాన్స్‌ కాదు.. 50ఏళ్లలో 10 ఛాన్స్‌లు ఇచ్చారని.. అప్పుడేం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు కేటీఆర్‌. అబద్ధాలు చెప్పడంలో, నటనలో ప్రధాని మోడీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఆయ‌న మ‌హాన‌టుడు అని.. ఆస్కార్‌కు పంపితే అవార్డు వ‌చ్చేద‌ని మోడీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story