వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్న మంత్రి కేటీఆర్

KTR: పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం

Jyothi
Published on: 7 Feb 2023 6:19 PM IST
Minister KTR Review of Vemulawada Shivaratri Celebrations
X

వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్న మంత్రి కేటీఆర్

KTR: వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను భవిష్యత్తులో యాదాద్రి తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. శివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లుచేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ప్రధానంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శివరాత్రి జాతరకోసం అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వేడుకలకు... సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story