గ్రేటర్‌ ఫలితాల పైన విశ్లేషించుకుంటాం : కేటీఅర్

వెలువడిన గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. టీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

Krishna
Published on: 4 Dec 2020 8:45 PM IST
గ్రేటర్‌ ఫలితాల పైన విశ్లేషించుకుంటాం : కేటీఅర్
X

వెలువడిన గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. టీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మేం ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని, ఇంకా 20, 30 సీట్లు అదనంగావస్తాయని అనుకున్నామని అన్నారు. 12 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని దీనికి టీఆర్ఎస్ శ్రేణులు నిరాశ పడాల్సిన పనిలేదని అన్నారు. ఇక గ్రేటర్‌ ఫలితాల పైన త్వరలోనే విశ్లేషించుకుంటామని అన్నారు. అటు మేయర్ పీఠంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.

Krishna

Krishna

Next Story