విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము : కేటీఆర్

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు..

Krishna
Published on: 10 Nov 2020 4:31 PM IST
విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము : కేటీఆర్
X

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. అయితే తాము విజయాలకి పొంగిపోమని, అలాగే అపజాయలకి కుంగిపోమని అన్నారు.. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.. ఇక ఫలితాలు ఎందుకు రాలేదనే అంశం పైన త్వరలోనే సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాక ఫలితాలతో తాము అప్రమత్తం అవుతామని అన్నారు.

ఇక అటు సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Krishna

Krishna

Next Story