KTR: ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు.. కేటీఆర్‌ కంటతడి..

KTR: సాయిచంద్‌ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2023 12:51 PM IST
Minister KTR Pays Tribute To Singer Saichand
X

KTR: ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు.. కేటీఆర్‌ కంటతడి..

KTR: సాయిచంద్‌ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచంద్‌కు రాష్ట్రమంత్రులు, పలువురు నేతలు నివాళులర్పించారు. గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.

సాయిచంద్‌ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్‌ మరణం తీరని లోటని తెలిపారు. ఉద్యమంలో పాటల ద్వారా అందరిని ఏకం చేశారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటే బతికేవాడేమో. స్వగ్రామానికి వెళ్లడం.. అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సాయిచంద్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని కేటీఆర్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story