HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహాక సమావేశం హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Minister KTR: తీర్మానాల కమిటీ, మీడియా కమిటీలను ప్రకటించనున్న కేటీఆర్

Rama Rao
Published on: 18 April 2022 4:37 PM IST
Minister KTR Meeting with Hyderabad Rangareddy Leaders on TRS Plenary
X

 HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహాక సమావేశం హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Minister KTR: HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహాక సమావేశం జరుగుతోంది. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సభ ఏర్పాట్లకు కమిటీలను కేటీఆర్ వేయనున్నారు. ఆహ్వాన కమిటీ, అలంకరణ కమిటీ, సభా ప్రాంగణ కమిటీ, భోజన కమిటీలను ప్రకటించనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయనున్నారు. మరోవైపు మున్సిపల్ , పోలీసు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, హెంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాగంటి, దానం నాగేందర్, ముఠా గోపాల్, వివేక్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్, ప్రభాకర్ రావు, వాణిదేవిలు పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story